Lithium Ion Cell: లిథియం అయాన్‌ సెల్‌ తయారీలో ఓలా!

14 Jul, 2022 07:43 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన తయరీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ లిథియం అయాన్‌ సెల్‌ను ఆవిష్కరించింది. దేశీయంగా అభివృద్ది చేసిన తొలి లిథియం అయాన్‌ సెల్‌ ఇదే కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. 

నిర్దిష్ట రసాయనాలు, పదార్థాలు ఉపయోగించడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని ఈ సెల్‌ నిక్షిప్తం చేస్తుంది. అలాగే సెల్‌ మొత్తం జీవిత కాలాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ వివరించింది. ‘ప్రపంచంలోని అత్యంత అధునాతన సెల్‌ రిసర్చ్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. ఇది సంస్థ సామర్థ్యం పెంచేందుకు, ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది.

 ప్రపంచంలో అత్యంత అధునాతన, సరసమైన ఎలక్ట్రిక్‌ వాహన ఉత్పత్తులను వేగంగా నిర్మించడానికి వీలు కల్పిస్తుంది’ అని ఓలా ఎలక్ట్రిక్‌ ఫౌండర్, సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. సెల్‌ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తున్న ఓలా.. పరిశోధన, అభివృద్ధికై 500 మంది పీహెచ్‌డీ, ఇంజనీరింగ్‌ చదివిన వారిని నియమించుకుంటోంది.

మరిన్ని వార్తలు