ఓలాకు భారీ షాక్‌, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్‌ అగర్వాల్‌!

12 May, 2022 15:01 IST|Sakshi

Ola Electric: ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థ ఓలాకు భారీ షాక్‌ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకు సీటీవో దినేష్‌ రాధా కృష్ణ గుడ్‌ బై చెప్పగా..తాజాగా వ్యక్తిగత కారణాల వల్ల ఓలాకు రాజీనామా చేస్తున్నట్లు సీఎంఓ వరుణ్‌ దుబ్‌ ప్రకటించారు. అయితే ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ, వాటి విడుదలలో కీరోల్‌ ప్లే చేస్తున్న టాప్‌ లెవల్‌ ఎక్జిక్యూటీవ్‌లు వదిలి వెళ్లిపోతుండడంతో ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

ఓలా ఎలక్ట్రిక్‌ గతేడాది సెప్టెంబర్‌ 15న 'ఓలా ఎస్1, ఎస్1ప్రో' ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ స్కూటర్లు అలా విడుదలయ్యాయో లేదో వాహనదారులు వాటిని ఎగబడి కొనుగోలు చేశారు.దీంతో కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ.1100కోట్ల విలువైన ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అమ్మినట్లు ఆ సంస్థ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. భారతీయ ఇ-కామర్స్‌ చరిత్రలో ఇదో ఘనమైన రికార్డ్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

కట్‌ చేస్తే.. సీన్‌ మారింది
కట్‌ చేస్తే విడుదలైన ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌లో లోపాలు ఆ సంస్థ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. స్కూటర్‌లలో ఉన్న బ్యాటరీల పనితీరు కారణంగా అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో ఆ సంస్థ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ యజమానులు గాయాలపాలవుతున్నారు.ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా అదే వెహికల్స్‌లో ఉన్న రివర్స్‌ మోడ్‌ ఆప్షన్‌ మోడ్‌ కారణంగా ప్రమాదాలకు గురవుతున్నామంటూ బాధితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఓలాను కుదిపేస్తుండగా.. అదే కారణాలతో ఓలా టాప్‌ లెవల్‌ ఎగ్జిక్యూటీవ్ లు వదిలి వెళ్లిపోతున్నారు.   


మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం..ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో సాంకేతిక లోపాలు, టైం ప్రకారం డెలివరీ చేయకపోవడం, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నా..భద్రత విషయంలో ఆ సంస్థ పనితీరపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కాలిపోతుంటే..మరోవైపు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆ సంస్థలో కీరోల్‌ ప్లే చేస్తున్న ఉద్యోగులు అన్ని సర్దుకొని సంస్థ నుంచి బయటకు వెళ్లి పోతున్నారు.

ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్ధుకొని
ఇటీవల కాలంలో ఓలాకు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్వయం సౌరభ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ పోర్వాల్, హెచ్‌ఆర్ హెడ్ రోహిత్ ముంజాల్, జనరల్ కౌన్సెల్ సందీప్ చౌదరిలు ఆ సంస్థకు గుడ్‌ బై చెప్పారు. సీటీవో దినేష్‌ రాధా కృష్ణన్‌తో పాటు తాజాగా ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ నిష్క్రమించారు. కాగా, గత వారం ఓలా సీఈఓ అరుణ్ సిర్దేశ్‌ముఖ్, స్ట్రాటజీ చీఫ్ అమిత్ అంచల్ సంస్థను విడిచి వెళ్లిపోతున్నారంటూ మనీకంట్రోల్ నివేదించిన విషయం తెలిసింది. 

అన్ని తానై ముందుండి నడిపిస్తున్న  
అయితే సంస్థ ఉన్నత స్థాయి సిబ్బంది విడిచి వెళ‍్లిపోవడంతో ఓలా సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా అన్నీ తానై సంస్థను ముందుండి నడిపిస్తున్నారు.రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్‌ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసి..తన వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించే పనిలో పడ్డారు ఓలా కోఫౌండర్‌, సీఈవో భవీష్‌ అగర్వాల్‌.

చదవండి👉 బ్రాండ్‌ ఇమేజ్‌కి డ్యామేజ్‌ అయితే కష్టం.. భవీశ్‌కి ఎన్ని తిప్పలో..

మరిన్ని వార్తలు