Ola Electric: మొత్తం మీరే చేశారు! భవీష్‌ అగర్వాల్‌.. మా ప్రాణాల్ని కాపాడండి!

26 May, 2022 16:05 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ దిగ్గజం ఓలా అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. ఓ వైపు 24 గంటల్లో వెహికల్‌ డెలివరీతో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండుగా..ఆ వెహికల్స్‌ను వినియోగిస్తున్న వాహనదారులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో యజమానులు ఆ సంస్థ అధినేత భవీష్‌ అగర్వాల్‌పై మండిపడుతున్నారు. 


ఇటీవల దేశ వ్యాప్తంగా ఓలా వెహికల్స్‌ వరుస ప్రమాదాల బారిన పడుతున్నాయి. బ్యాటరీ సమస్య కారణంగా మంటల్లో కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్‌ టైర్లు ఊడిపోవడం, విరిగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

తాజాగా కేరళకు చెందిన శ్రీనాథ్‌ మీనన్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ తనకు జరిగిన ప్రమాదంపై ట్వీట్‌ చేశాడు. నామమాత్రం స్పీడ్‌లో ప్రయాణిస్తున్నా వెహికల్స్‌ కు ప్రమాదాలు జరుగుతున్నాయని, తాను డ్రైవింగ్‌ చేసే సమయంలో వెహికల్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌ ఇరిగిపోయింది. ఓలా సీఈవో ఈ ప్రమాదాలపై స్పందించాలి. రిప‍్లెస్‌మెంట్‌ లేదంటే డిజైన్‌లు మార్చి నాసిరకం మెటియరల్‌ కారణంగా రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని ట్వీట్‌లో పేర్కొన‍్నాడు.

ఈకో మోడ్‌లో 25 కేఎంపీహెచ్‌ స్పీడ్‌తో ఓలా బైక్‌ ప్రమాదానికి గురైందని మరో ట్విట్టర్‌ యూజర్‌ ఆనంద్‌ ఎల్‌ తెలిపాడు. ఈ సందర్భంగా నాతో పాటు ఇతర ఓలా వాహనదారులు సైతం ఈ తరహా ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక నా వెహికల్‌కు జరిగిన ఈ ప్రమాదంలో నా తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖం మీద లోతుగా తెగిన గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడంటూ భవీష్‌ అగర్వాల్‌ రీట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.

చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే..

మరిన్ని వార్తలు