ఆర్‌ అండ్‌ డీ అడ్డాగా హైదరాబాద్‌.. మూడో ల్యాబ్‌కి రెడీ అటున్న ప్రముఖ కంపెనీ

29 Jan, 2022 13:19 IST|Sakshi

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్‌ దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే స్టార్టప్‌ కల్చర్‌ ఇక్కడ బలపడుతుండగా ఇప్పుడు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం కూడా అదే దారిలో పయణిస్తుంది.భౌగోళిక అనుకూలతలు హుమన్‌ రిసోర్స్‌ లభ్యతలలు హైదరాబాద్‌కి అనుకూలంగా మారాయి. 

మెరుగైన బ్యాటరీ
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మేజర్‌ షేర్‌ కలిగిన కంపెనీల్లో ఒకటైన ఓప్పో హైదరాబాద్‌లో మరో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే బ్యాటరీ బ్యాకప్‌ పెంచేందుకు అనువైన టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించింది. రానురాను డిజిటలైజేషన్‌ పెరిగిపోవడం థర్డ్‌పార్టీ యాప్‌ల వినియోగం పెరగడంతో మెరుగైన బ్యాటరీ అవసరం ఏర్పడుతోందని అందుకే ఈ విషయంలో హైదరాబరాద్‌లో ఆర్‌ అండ్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు ఒప్పో ఇండియా ఆర్‌ అండ్‌ డీ హెడ్‌ తస్లీమ్‌ ఆరీఫ్‌ తెలిపారు.

280 పేటెంట్‌లు?
ఇప్పటికే ఒప్పో సంస్థకు హైదరాబాద్‌లో రెండు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లు ఉన్నాయి. 2020 డిసెంబరులో 5జీ ల్యాబ్‌ని ఏర్పాటు చేయగా 2021 ఆగస్టులో కెమెరా ల్యాబ్‌ ప్రారంభమైంది. తాజాగా 2022 మొదటి త్రైమాసికంలో బ్యాటరీ ల్యాబ్‌ కూడా మొదలుకానుంది. ఒప్పో హైదరాబాద్‌  ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో 450 మంది ఇంజనీర్లు పని చేస్తుండగా  ఇప్పటి వరకు పేటెంట్‌ హక్కుల కోసం 280 దరఖాస్తులు చేసింది. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ విభాగంలో పని చేస్తుంది.

చదవండి:హైదరాబాద్‌లో సూపర్‌ కంప్యూటర్‌? రెడీ అయిన అమెరికా కంపెనీ! 

మరిన్ని వార్తలు