SBI Revised Guidelines: ఎస్‌బీఐ కొత్త రూల్స్‌.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు

29 Jan, 2022 13:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్‌ బ్యాంక్‌కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్‌బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్‌బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్  కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
(చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం)

మరిన్ని వార్తలు