Parag Desai Death: వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.. వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపార వేత్త కన్నుమూత!

24 Oct, 2023 07:31 IST|Sakshi

వీధి కుక్కల దాడితో ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్‌ కన్నుమూశారు. 

అక్టోబర్‌ 15న మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన పరాగ్‌ దేశాయ్‌ను వీధి కుక్కలు వెంబడించాయి. ఆపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా, అహ్మదాబాద్‌లోని జైదాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెదడులో రక్తస్రావం వల్ల కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆస్పత్రిలో మరణించినట్లు వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌  కంపెనీ వెల్లడించింది. పరాగ్‌ మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

అంకితభావానికి కేరాఫ్‌ అడ్రస్‌
వ్యాపార రంగంలో సరికొత్త ఆవిష్కరణలకి, అంకితభావానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు పరాగ్ దేశాయ్. భారత్‌లోనే అతిపెద్ద 3వ ప్యాకేజ్డ్ వాఘ్ బక్రీ టీ’ గా అవతరించడంలో విశేషంగా కృషి చేశారు.  

వారసత్వ వ్యాపారంలో అడుగు
వాఘ్ బక్రీ టీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. పరాగ్ దేశాయ్ అమెరికా లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏని ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం, వారసత్వంగా వస్తున్న టీ’ వ్యాపారంలో అడుగు పెట్టారు. తన తండ్రి రసేష్ దేశాయ్ స్థాపించిన వాఘ్‌ బక్రీ టీ సంస్థలో అమ్మకాలు, మార్కెటింగ్, ఎగుమతి విభాగాల్లో కీలక పాత్ర పోషించారు.  

రూ.2,000 కోట్ల టర్నోవర్‌
1892లోవాఘ్‌ బక్రీ గ్రూప్‌ను పరాగ్‌ తండ్రి నరన్‌దాస్‌ దేశాయ్‌ ప్రారంభించారు. అయితే పరాగ్ దేశాయ్ నేతృత్వంలో వాఘ్ బక్రీని భారతదేశపు మూడవ అతిపెద్ద ప్యాకేజ్డ్ టీ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, వారసత్వం,సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ కొత్త కొత్త వ్యాపార వ్యూహాలతో ముందుకు సాగారు. తన దూరదృష్టి తో వాఘ్ బక్రీ టీ పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్లగలిగారు. ఈ వాఘ్‌ బక్రీ టీ ఒక్క మనదేశంలోనే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంటి పేరుగా మారింది.  నేడు ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్‌ రూ.2,000 కోట్లు.  

మరిన్ని వార్తలు