లఘు, చిన్న పరిశ్రమలకు చేయూత

30 Jul, 2021 05:39 IST|Sakshi

ఫాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లుకు పార్లమెంటు గురువారం ఆమోదముద్ర వేసింది. జూలై 26న బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగా, తాజాగా రాజ్యసభ ఆమోదం పొందింది.  ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంఎస్‌ఎంఈ రంగానికి వర్కింగ్‌ క్యాపిటల్‌ లభ్యత కొంత సులభతరం అవుతుంది. ప్రభుత్వం రంగ సంస్థలుసహా తమకు  బకాయిలు చెల్లించాల్సిన కంపెనీల నుంచి  ఎంఎస్‌ఎంఈలు త్వరిత గతిన వసూళ్లును చేయగలుగుతాయి. తమకు రావాల్సిన మొత్తాలను మూడవ పార్టీకి విక్రయించి తక్షణ నిధులు పొందడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పరిశ్రమలు వర్కింగ్‌ క్యాపిటల్‌ విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనకుండా తాజా బిల్లు ఆమోదం దోహదపడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బిల్లు ఆమోదం చర్చ సందర్భంగా పేర్కొన్నారు. యూకే సిన్హా కమిటీ చేసిన పలు సిఫారసులను ఈ బిల్లులో చేర్చారు.  2020 సెప్టెంబర్‌లో బిల్లును తీసుకువచ్చారు. అనంతరం హౌస్‌ స్థాయి సంఘానికి రిఫర్‌ చేశారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు