Paytm: పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌, ప్రారంభించిన పేటీఎం

14 Sep, 2021 11:12 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) తెలిపింది.

కష్మీర్‌ గేట్‌ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్‌ స్టికర్‌ గల కార్లు.. పార్కింగ్‌ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్‌ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదని వివరించింది. ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్‌ తెలిపింది .
 

చదవండి: ‘ఫాస్ట్‌’గా దోచేస్తున్నారు..

మరిన్ని వార్తలు