Delhi liquor scam: జైలు నుంచి ఇంటికెళ్లిన సిసోడియా

12 Nov, 2023 05:04 IST|Sakshi
శనివారం ఢిల్లీలోని తన నివాసంలో భార్య, కుమారుడితో ‘చోటీ దివాలీ’ వేడుకల్లో సిసోడియా

భార్యను చూసేందుకు ఓకే చెప్పిన ఢిల్లీ సిటీ కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తీహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు కొద్దిసేపు ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓదార్చేందుకు ఆరు గంటలపాటు ఇంటికి వెళ్లేందుకు సిసోడియాకు ఢిల్లీ సిటీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. తిహార్‌ జైలు నుంచి ఢిల్లీలోని మధుర రోడ్డులో గల నివాసానికి శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగింటివరకు ఆయనకు అనుమతి ఇచ్చింది.

కొంతకాలంగా సిసోడియా భార్య సీమా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ సిసోడియా గతంలో కోర్టును కోరిన విషయం విదితమే. దీంతో ఆయనకు కోర్టు ఇలా కొద్దిగంటలపాటు ఉపశమనం కలి్పంచింది. అయితే బయట ఉన్న సమయంలో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. గతంలోనూ భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచి్చనా ఇంటికొచ్చే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కలవలేకపోయారు.
 

మరిన్ని వార్తలు