సామాన్యుడికి చుక్కలు.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

26 Mar, 2022 08:44 IST|Sakshi

దేశ వ్యాప్తంగా సామాన్యులపై పెట్రోల్‌, డీజిల్‌ వాత కొనసాగుతోంది. ఐదు రోజుల్లో నాలుగో సారి చమురు సంస్థలు ధరలు పెంచాయి. దీంతో శనివారం దేశ వ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌ పై 89పైసలు, డీజిల్‌పై  86పైసలు పెరిగాయి.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్‌ ఏకంగా 2.25 బిలియన్‌ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరగనున్నట్లు సమాచారం.  

దేశంలో పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.80 పైసలు ఉండగా డీజిల్‌ ధర రూ.98.10గా ఉంది

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.60 పైసలు ఉండగా డీజిల్‌ ధర రూ.99.56 పైసలుగా ఉంది. 

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.61పైసలు ఉండగా డీజిల్‌ ధర రూ.89.87 పైసలుగా ఉంది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.35పైసలుగా ఉండగా డీజిల్‌ ధర రూ.97.55పైసలుగా ఉంది

చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.43పైసలు ఉండగా డీజిల్‌ ధర రూ.94.47పైసలుగా ఉంది 

బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.93 పైసలు ఉండగా  డీజిల్‌ ధర రూ.88.14పైసలుగా ఉంది

మరిన్ని వార్తలు