పీడబ్ల్యూసీలో 30,000 నియామకాలు

18 Feb, 2023 03:59 IST|Sakshi

న్యూఢిల్లీ: రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో సుమారు 30,000 మంది సిబ్బందిని తీసుకునే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ చైర్మన్‌ బాబ్‌ మోరిట్జ్‌ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 31,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, భారత్‌పై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ చైర్మన్‌ జాన్‌–పాస్కల్‌ ట్రైకోయిర్‌ తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్‌ తమకు అతి పెద్ద మార్కెట్‌గా ఉందని వివరించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పురోగమించేందుకు భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు