Raghuram Rajan On Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సంచలన వ్యాఖ్యలు..!

25 Nov, 2021 19:54 IST|Sakshi

రాబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రిప్టో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. తాజాగా క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సంచలన వ్యాఖ్యలను చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000కు పైగా క్రిప్టోకరెన్సీ చెలామణీలో ఉందని, రాబోయే రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు.   అంతేకాకుండా ప్రస్తుత క్రిప్టో ధరలు పూర్తిగా నీటి బుడగలాంటిదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న క్రిప్టో క్రేజ్‌ను 17వ శతాబ్దం నాటి నెదర్లాండ్స్‌ తులిప్‌ మానియాతో అభివర్ణించారు. 
చదవండి: క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్‌ హవా

అన్‌ రెగ్యులేటెడ్‌ చిట్‌ ఫండ్స్‌..!
క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్‌తో రఘురాం రాజన్‌  పోల్చారు. చిట్‌ఫండ్స్‌ నుంచి డబ్బులు పొందిన వారిలాగే క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా రాబోయే రోజుల్లో బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు వ్యాల్యూ లేదన్నారు. క్రిప్టోలో కొన్ని మాత్రమే చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని..వాటిలో కూడా  క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాడతారని తెలిపారు. భారత్‌లోని 15-20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు సుమారు 5.39 బిలియన్‌ డాలర్ల క్రిప్టో కరెన్సీను కల్గి ఉన్నారు.

రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 
చదవండి: క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే!

మరిన్ని వార్తలు