లోన్ యాప‍్స్‌పై ఆర్‌బీఐ స్పందన

23 Dec, 2020 16:38 IST|Sakshi

వాటి మాయలో పడొద్దు: ఆర్బీఐ

ముంబై: అధిక వడ్డీలు వసూలు చేస్తున్న రుణ యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో ఆర్బీఐ సీజీఎం యోగేశ్ దయాల్ స్పందించారు. ఆర్బీఐ, ఎన్‌బీఎఫ్సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలి కానీ, ఎటువంటి నియమ నిబంధనలు పాటించని యాప్ ల దగ్గర రుణాలు తీసుకోవద్దని కోరారు. కొన్ని యాప్‌లు.. రుణాల పేరుతొ మీ దగ్గర నుండి అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్లు తెలిసింది అని చెప్పారు. రుణాల కోసం మీ వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వవద్దని పేర్కొన్నారు. దింతో వీరు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. సులభంగా రుణాలు ఇస్తున్నారా కదా అని ఈ యాప్‌ల మాయలో మాత్రం పడవద్దు అని సూచించారు. ఒకసారి రుణాలు తీసుకునే ముందు ఆలోచించాలి అన్నారు. ఎవరైనా ఇటువంటి యాప్ లతో మోసపోతే వెంటనే sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.(చదవండి: ఓ‌లా గుడ్‌ న్యూస్


 

మరిన్ని వార్తలు