ఆర్‌బీఐ కీలక నిర్ణయం, యూపీఐ పేమెంట్స్‌ చెల్లింపు దారులకు శుభవార్త!

8 Dec, 2023 15:39 IST|Sakshi

యూపీఐ ఖాతాదారులకు శుభర్తవార్త. యూపీఐ ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ను పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా యూపీఐ ద్వారా చేసే జరిపే కొన్ని ట్రాన్సాక్షన్‌లకు సంబంధించిన లావాదేవీల లిమిట్‌ను పెంచుతున్నట్లు తెలిపారు. 

తాజాగా, జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో  తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. ఆర్‌బీఐ ప్రకటన ప్రకారం.. యూపీఐ ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ గతంలో రోజుకు రూ.25,000 నుంచి రూ.1లక్ష వరకు చేసుకునే అవకాశం ఉంది. తాజాగా, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్‌లలో హాస్పిటల్స్‌ బిల్స్‌, ఎడ్యుకేషన్ ఫీజులు సైతం ఉన్నాయి.  

‘‘యూపీఏ ద్వారా జరిపే వివిధ రకాల ట్రాన్సాక్షన్‌లపై ఆర్‌బీఐ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యూపీఐ రోజువారీ ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ను పెంచాలని ప్రతిపాదించాం. ఈ నిర్ణయం ఎవరైతే వినియోగదారులు హాస్పిటల్స్‌, కాలేజీల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది’’ అని శక్తికాంత్‌ అన్నారు.   

 

ఈ-మ్యాన్‌డేట్‌ తప్పని సరి
బ్యాంక్‌ ఖాతాదారులు కేబుల్‌ బిల్స్‌, మొబైల్‌ బిల్స్‌, ఓటీటీ సబ్‌స్కిప్షన్‌, ఇతర నిత్యవసరాలకు చెల్లింపులు జరుపుతుంటారు. వాటినే రికరింగ్‌ ట్రాన్సాక్షన్‌ అంటారు. సాధారంగా బ్యాంకులు అందించే డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ ద్వారా ఈ రికరింగ్‌ పేమెంట్స్‌ లిమిట్‌ గతంలో నెలకు రూ.15,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని ఆర్‌బీఐ యోచిస్తుంది. అదే సమయంలో ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే కస్టమర్లు ‘ఈ- మ్యాన్‌డేట్‌’ తప్పని చేసింది. 


ఈ-మ్యాన్‌డేట్‌ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు 

ఈ-మ్యాన్‌డేట్‌ ఫారమ్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు ఈ- మ్యాన్‌డేట్‌ ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ చూపించిన వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఈ -మ్యాన్‌డేట్‌ కోసం తప్పని సరిగా బ్యాంక్‌ అకౌంట్‌, బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్‌ చేసిన ఆధార్‌ కార్డ్‌, ఫోన్‌ నెంబర్‌ తప్పని సరి .ఈ విధానంలో బ్యాంక్‌ అడిగిన వివరాల్ని ఖాతాదారులు అందించాల్సి ఉంటుంది. అనంతరం, రికరింగ్‌ పేమెంట్స్‌ను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు.

చదవండి👉 నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్‌ సైతం

>
మరిన్ని వార్తలు