Russia Ukraine War Effect: కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!

25 Feb, 2022 16:25 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో బ్రెంట్ బ్యారెల్ ముడి చమరు ధర $100కు చేరుకుంది. అయితే, ముడి చమురు ధరలు పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.95,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల నష్టం కలగవచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) ఆర్థిక విభాగం ఒక నివేదికలో తెలిపింది. రెండు రోజుల నుంచి ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2021 నుంచి పెట్రోల్ & డీజిల్ ధరలలో పెద్దగా మార్చలేదు. 

"ప్రస్తుతం ధరల ప్రకారం.. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $95/బిబిఎల్.-$110 బిబిఎల్ మధ్య ఉంది. అయితే, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఉన్న ప్రస్తుత డీజిల్ & పెట్రోల్ ధరల కంటే రూ.9-14 ఎక్కువగా ఉండాలి" అని ఎస్‌బీఐ 'ఎకోర్యాప్' పేర్కొంది. అయితే, ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చిలో పెట్రోల్ & డీజిల్ ధరలు పెరగకుండా ఉండాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7 తగ్గించాల్సి ఉంటుంది అని పేర్కొంది. అప్పుడు నెలకు రూ.8,000 కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. "వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ & డీజిల్ వినియోగం ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరిగితే అప్పుడు ప్రభుత్వం నష్టం సుమారు 95000 కోట్ల నుండి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది" అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతంగా ఉంది. గత ఏడు నెలల కాలంలో ఇదే గరిష్టం. 

(చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!)

మరిన్ని వార్తలు