Rolls-Royce Black Badge Ghost: హల్‌చల్‌ చేస్తోన్న రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌..! ధర ఎంతంటే..?

23 Apr, 2022 21:29 IST|Sakshi

భారత మార్కెట్లలోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ సరికొత్త కారును లాంచ్‌ చేసింది. రోల్స్‌ రాయిస్‌ బ్లాక్ బ్యాడ్జ్ గోస్ట్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రోల్స్‌ రాయిస్‌ బ్లాక్ బ్యాడ్జ్ గోస్ట్‌ ధర రూ. 12.25 కోట్ల నుంచి ప్రారంభంకానుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ రోల్స్‌ రాయిస్‌ ప్రసిద్ధ లగ్జరీ సెడాన్, ఘోస్ట్‌కి అప్‌గ్రేడ్‌గా రానుంది.

బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్‌లో శక్తివంతమైన 6.75-లీటర్ వీ12 ఇంజన్‌ను అమర్చారు. ఇది స్టాండర్డ్‌ ఘోస్ట్‌తో పోల్చితే అదనంగా 29 పీఎస్‌ శక్తిను,  50 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారులో కొత్త జెడ్‌ఎఫ్‌ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఈ కారులో లగ్జరీ సెడాన్ 'స్పోర్ట్' మోడ్‌ను ఎనేబుల్ చేసేందుకుగాను కొత్త బటను చేర్చారు.

'స్పోర్ట్' మోడ్ థ్రోటెల్‌తో కారు కేవలం 4.7 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గేర్ షిఫ్టింగ్ మరింత వేగంగా మారుతుంది. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ వీల్స్ 21-అంగుళాల బెస్పోక్ కాంపోజిట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండనుంది. పాంథియోన్ గ్రిల్‌తో పాటు 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ' క్రోమ్ బ్లాక్‌తో రానుంది. సిగ్నేచర్ హై-గ్లోసీ బ్లాక్ పియానో ​​44,000 ఫినిషింగ్‌లలో కస్టమర్‌లు ఎంచుకోవచ్చు.

చదవండి: 10 వేలకుపైగా ఉద్యోగాలు...ఈవెన్‌ కార్గోతో హీరో ఎలక్ట్రిక్‌ జోడీ 

మరిన్ని వార్తలు