అయ్యో రూపాయి! వరుసగా మూడోరోజూ క్రాష్‌..!

13 Oct, 2021 11:05 IST|Sakshi

16 పైసలు క్షీణించి 75.52 వద్ద ముగింపు 

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది. మంగళవారం మరో 16 పైసలు క్షీణించి 75.52 వద్ద ముగిసింది. రూపాయికిది వరసగా మూడోరోజూ నష్టాల ముగింపు కాగా.., మొత్తం 73 పైసలు పతనమైంది.

ఫారెక్స్‌ మార్కెట్లో మంగళవారం ఉదయం 75.41 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 75.66 వద్ద కనిష్టాన్ని 75.16 గరిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ విలువ కొన్నేళ్ల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.6% పెరిగింది. బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 80 డాలర్ల స్థాయిని దాటింది. ఈ అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి. స్వల్పకాలం పాటు రూపాయి 74.90 – 75.80 పరిధిలో ట్రేడ్‌ అవ్వొచ్చు’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ హెడ్‌ శ్రీరామ్‌ అయ్యర్‌ తెలిపారు. గతేడాది(202) ఏప్రిల్‌లో రూపాయి 76.87 స్థాయి వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే.
 

చదవండి: Economy: ఎకానమీలో వెలుగు రేఖలు

మరిన్ని వార్తలు