టీపీ గ్లోబల్‌ కేసు: భారీగా నగలు,నగదు, లగ్జరీ కార్లు సీజ్‌

19 Sep, 2023 20:27 IST|Sakshi

TP Global FX: టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ ఫారెక్స్ ట్రేడింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్‌ ఆరోపణల కింద అహ్మదాబాద్‌లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు మంగళవారం అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సోదాల్లో వివిధ నేరారోపణ పత్రాలు, భారీ  ఎత్తున నగదు, నగలు, విలువైన కార్లను స్వాధినంచేసుకుంది.  (Jio AirFiber: జియో ఎయిర్‌ ఫైబర్‌ వచ్చేసింది..లాంచింగ్‌ ధర, ఆఫర్లు)

టీపీ  గ్లోబల్ ఎఫ్ఎక్స్‌  అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ దాడులు  చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం  రూ. 1.36 కోట్లు, 1.2 కిలోల బంగారం (సుమారు రూ. 71 లక్షలు), రెండు లగ్జరీ వాహనాలు, హ్యుందాయ్  ఆల్కాజర్ , మెర్సిడెస్ GLS 350D (సుమారు రూ. 89 లక్షలు)  కార్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు, బ్యాంక్ ఖాతాలో రూ. 14.72 లక్షలు స్తంభింప జేశామని ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.242.39 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు లేదా అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌)

ఇప్పటికే ఈ  కేసులో టీపీ గ్లోబల్‌  ఎఫ్‌ఎక్స్‌ కంపెనీ ద్వారా  అక్రమ  లావాదేవీలకు  పాల్పడ్డారంటూ  ప్రసేన్‌జిత్ దాస్, శైలేష్ పాండే, తుషార్ పటేల్ ఆరోపణలు నమోదైనాయి.డమ్మీ కంపెనీలు/సంస్థలు/ఎంటిటీలద్వారా ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో  మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.  గతంలో అరెస్ట్‌ అయిన వీరు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే  రూ.118.27 కోట్ల విలువైన స్థిరాస్తులను హోటల్  రిసార్ట్స్, వాహనాలు, అటాచ్ చేసింది.

మరిన్ని వార్తలు