Wireless Earbuds: ఏఐ టెక్నాలజీతో వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌, సూపర్‌ ఫీచర్లతో

21 Oct, 2021 17:19 IST|Sakshi

టెక్‌ మార్కెట్‌లో వైర్‌ లెస్‌ ఇయర్‌ బడ్స్‌ హవా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రముఖ టెక్‌ కంపెనీలు విడుదల చేసిన వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ వినియోగదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజగా మరో సంస్థ సౌండ్‌ కోర్‌ బడ్జెట్‌ ధరలో 'లైఫ్‌ నోట్‌ ఈ టీడబ్ల్యూఎస్‌'  పేరుతో ఇయర్‌ బడ్స్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. 

ఫీచర్లు 
ఆడియో టెక్నాలజీలో గ్లోబుల్‌ లీడర్‌ గా ఉన్న సౌండ్‌ కోర్‌ తాజాగా బ్యాడ్మింటన్ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌ చేతులు మీదిగా 'లైఫ్‌ నోట్‌ ఈ టీడబ్ల్యూఎస్‌'  పేరుతో ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసింది. ఇక ఇయర్‌ బడ్స్‌లోని ఫీచర్ల  విషయానికొస్తే 32హెచ్‌ ప్లే టైమ్‌, 3 ఈక్యూమోడ్స్‌, బిగ్‌ బ్యాస్‌, ట్రిపుల్‌ లేయర్‌ 10ఎంఎం డ్రైవర్స్‌, 50 శాతం పవర్‌ ఫుల్‌ బ్యాస్‌తో మెస్మరైజ్‌ చేసేలా సౌండ్‌ను అందిస్తుంది. యూనిక్‌ 3 ఈ క్యూ మోడ్స్‌, సౌండ్‌ కేర్‌ సిగ్నేచర్స్‌ ఫీచర్లు ఉన్నాయి. 

ఏఐతో పనిచేస్తుంది
ఇక ఈ లైఫ్‌ నోట్‌ ఈ ఇయర్‌ బడ్స్‌ పూర్తిగా ఏఐ టెక్నాలజీ పనిచేస్తుందని సౌండ్‌ కోర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు 4.6 గ్రాముల బరువు ఉండే ఈ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ వినియోగిస్తున్నామనే ఫీలింగ్‌ ఉండదు. లైట్‌ వెయిట్‌తో పాకెట్‌ ఫ్రెండ్లీ ఇయర్‌ బడ్స్‌ ధర రూ.2,799 ఉండగా.. లాంచ్‌ సందర్భంగా  రూ.1999కే అందిస్తున్నట్లు సౌండ్‌ కోర్‌ తెలిపింది.    

మరిన్ని వార్తలు