సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

20 Nov, 2023 15:43 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 19694 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 139 పాయింట్లు కుంగి 65655 వద్ద స్థిరపడింది. 

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మార్కెట్లకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారం ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్ సమావేశం ఉండడంతో మదుపర్లు, ట్రేడర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్మాల్‌క్యాప్‌ స్టాక్‌లు అంతగా నష్టాల్లోకి వెళ్లడం లేదని, కానీ లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో మంచి డిస్కౌంట్లో ట్రేడవుతున్నాయని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మంచి లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో మదుపు చేయడం ద్వారా లాభాలు సంపాదించవచ్చని సూచిస్తున్నారు.

సెన్సెక​్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌మహీంద్రా బ్యాంక్‌, మారుతిసుజుకీ, టైటాన్‌, ఎస్‌బీఐ స్టాక్‌లు లాభాల్లో ట్రేడయ్యాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాన్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ​్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా కంపెనీలు నష్టాల్లో కదలాడాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు