స్టాక్ మార్కెట్లు అదుర్స్

5 Nov, 2020 09:37 IST|Sakshi

సెన్సెక్స్@ 41,000- నిఫ్టీ@ 12,000

528 పాయింట్ల హైజంప్- 41,144కు చేరిన సెన్సెక్స్

155 పాయింట్లు ఎగసి 12,063 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బ్యాంకింగ్‌, ఐటీ, మీడియా, మెటల్ జూమ్

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం అప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 528 పాయింట్లు జంప్‌చేసి 41,144కు చేరగా.. నిఫ్టీ 155 పాయింట్లు పెరిగి 12,063 వద్ద ట్రేడవుతోంది. వెరసి అటు సెన్సెక్స్ 41,000 పాయింట్ల మైలురాయినీ, ఇటు నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్ నూ సులభంగా అధిగమించాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న ట్రంప్, జో బైడెన్ లకు సమాన అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో బుధవారం అమెరికా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు 1.5-4 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు.  

బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ ఎంసీజీ, మెటల్ 2-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్బీఐ, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, యూపీఎల్, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, టీసీఎస్‌, టాటా స్టీల్‌, విప్రో 5.6-1.4 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం హీరో మోటో, సన్‌ ఫార్మా, సిప్లా 1.2-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి.

హెచ్పీసీఎల్ జూమ్
డెరివేటివ్స్‌లో హెచ్పీసీఎల్, మెక్డోవెల్, పీవీఆర్‌, కెనరా బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్, గోద్రెజ్ సీపీ, శ్రీరామ్ ట్రాన్స్, మైండ్ ట్రీ, అంబుజా 7-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్ ప్రాపర్టీస్, లుపిన్, అదానీ ఎంటర్, పెట్రోనెట్, అపోలో టైర్, టీవీఎస్ మోటార్ 2-0.4 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1145 లాభపడగా.. 408 నష్టాలతో కదులుతున్నాయి. 

మరిన్ని వార్తలు