StockMarketOpening: గ్లోబల్‌ మార్కెట్లు డల్‌, కానీ సెన్సెక్స్‌ దూకుడు

28 Oct, 2022 10:22 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సూచనలు ఉన్నప్పటికీ  శుక్రవారం వరుసగా రెండవ సెషన్‌లోనూ లాభాల్లో షురూ అయ్యాయి. ఆ తరువాత మరింత పుంజుకుని ప్రస్తుతం  373  పాయింట్లు ఎగిసి సెన్సెక్స్‌ 60వేల మార్క్‌ను దాటేయగా, నిఫ్టీ  101 పాయింట్లు జంప్‌ చేసి 17837 స్థాయికి చేరింది.దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. 

బజాజ​ ఆటో, ఓఎన్జీసీ, రిలయన్స్‌,  కోల్‌ ఇండియా , మారుతి సుజుకి భారీగా లాభపడుతుండగా, టాటా స్టీల్‌, హిందాల్కో, సన్‌ఫార్మా, దివీస్‌ లాబ్స్‌ తదితరాలు నష్టపోతున్నాయి.  అటు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌గా ఉంది.  17 పైసలు  ఎగిసి 82.35 వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు