సెన్సెక్స్‌.. డబుల్‌ సెంచరీతో షురూ

6 Aug, 2020 09:33 IST|Sakshi

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ప్లస్‌లో

నేడు రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు ప్రకటించనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 207 పాయింట్లు ఎగసి 37,870కు చేరగా.. నిఫ్టీ 56 పాయింట్లు బలపడి 11,158 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్‌-19 కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చే బాటలో ఆర్‌బీఐ సరళతర నిర్ణయాలు ప్రకటించవచ్చ న్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 1-0.4 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, విప్రో, టాటా మోటార్స్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటో, టీసీఎస్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యాక్సిస్‌, మారుతీ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి.

డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో కాల్గేట్‌, అదానీ ఎంటర్‌, అంబుజా, బాలకృష్ణ, అశోక్‌ లేలాండ్‌ 1 శాతం స్థాయిలో పుంజుకోగా..  అపోలో టైర్‌, పీవీఆర్‌, బాటా, మ్యాక్స్ ఫైనాన్స్‌, ముత్తూట్‌, ఆర్‌బీఎల్‌ 3.4-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1016 లాభపడగా.. 446 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు