స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్!

9 Nov, 2021 16:04 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో సానుకూలంగా ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, బజాజ్ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, వంటి భారీ కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం సూచీల సెంటిమెంటును దెబ్బ తీసింది. చివరకు, సెన్సెక్స్ 112.16 పాయింట్లు(0.19%) క్షీణించి 60,433.45 వద్ద ఉంటే, నిఫ్టీ 24.20 పాయింట్లు(0.13%) క్షీణించి 18,044.30 వద్ద ముగిసింది. నేడు సుమారు 1958 షేర్ల విలువ పెరిగితే, 1269 షేర్ల విలువ క్షీణించాయి, 162 షేర్లు విలువ మారలేదు.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.01 వద్ద ఉంది. ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఒఎన్‌జీసీ, ఎస్బిఐ షేర్లు ఎక్కువ లాభం పొందితే.. బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, జెఎస్ డబ్ల్యు స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు ఎక్కువగా క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగితే .. మెటల్, బ్యాంకింగ్ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. 

(చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి తీపికబురు చెప్పిన నితిన్ గడ్కరీ)

మరిన్ని వార్తలు