ఐదో రోజూ ఆగని పతనం: కరెక్షన్‌ మంచిదే!

28 Jan, 2021 16:22 IST|Sakshi

ఐదు సెషన్లలో 3వేల పాయింట్లు పతనం

సాక్షి,ముంబై:   2021లో కొత్త ఏడాదిలో ఆల్‌టైం రికార్డులుతో మెరుపులు మెరిపించింది దలాల్ స్ట్రీట్. కానీ ఏడాది తొలి డెరివేటివ్‌  సిరీస్‌మాత్రం నష్టాల్లో ముగిసింది.  జీవితకాలం గరిష్టాలు, వచ్చే వారం రానున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలుమార్కెట్లనుదెబ్బతీసాయి. దాదాపుఅన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. ప్రధానంగా ప్రభుత్వరంగ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇంట్రా డేలో ఏకంగా  800 పాయింట్లకుపైగా సెన్సెక్స్‌ పతనమై 47వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 13750 స్థాయిని కూడా  కోల్పోయింది. అయితే చివరి అర్ధగంటలో కాస్త తెప్పరిల్లింది. చివరకు సెన్సెక్స్‌   536 పాయింట్ల నష్టంతో 46874 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 13817వద్ద  స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసిజి, ఐటి, రియాల్టీ ఇండెక్స్  1.5-2.7 శాతం మధ్య నష్టపోయాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్‌, ఐసీఐసీ బ్యాంక్  భారీగా నష్టపోయాయి.  విప్రో,  పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, యూపీఎల్, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్ కూడా నష్టాలో ముగిసాయి. అయితే రికార్డు స్థాయిల నుండి ఇది ఆరోగ్యకరమైన దిద్దుబాటని, బడ్జెట్ కంటే ముందే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారని డెరివేటివ్ రోల్ ‌ఓవర్ల బట్టి అర్థమవుతుందని ఇది మంచి సంకేతమని ఐడీబీఐ క్యాపిటల్ పరిశోధన విభాగాధిపతి  ఏకే ప్రభాకర్ అన్నారు 

మరిన్ని వార్తలు