కరోనా షాక్‌ : మార్కెట్ల పతనం

25 Mar, 2021 09:39 IST|Sakshi

 బ్యాంకింగ్‌ షాక్‌, సెన్సెక్స్‌ 49వేల దిగువకు

 నిఫ్టీ 14500 దిగువకు

 2 శాతం ఎగిసిన జూబిలెంట్ ఫుడ్

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. కానీ వెంటనే ఇన్వెస్టర్ల అమ్మకాలతో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రదానంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 49 వేల  దిగువకు పడిపోయింది. అటు నిప్టీ కూడా 14500 స్తాయిని కూడా కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 340 పాయింట్లు కోల్పోయి 48839 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు పతనంతో 14447 వద్ద  కొనసాగుతున్నాయి. టాటామోటార్స్‌, అదానీ, మారుతి సుజుకి,  యాక్సిస్‌ బ్యాంకు ఐటీసీ, ఇండస్‌ఇండ్‌, కోటక్‌ మహీంద్ర,  బ్యాంకు ఆఫ్‌ ఇండియా నష్టపోతున్నాయి. మరోవైపు భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అంతటా పొపాయ్ రెస్టారెంట్లకు సబ్ లైసెన్సింగ్ ప్రకటించడంతో జూబిలెంట్ ఫుడ్ 2 శాతం లాభపడుతోంది. (గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ)

కరోనా మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా మార్కెట్లుదాదాపు 2 శాతం కుప్పకూలాయి. ఐరోపాలో కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌ ఆందోళనలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు నడిపిస్తోంది.  (వరుసగా రెండో రోజు తగ్గిన పెట్రోలు ధర)

కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 53,476 కొత్త కోవిడ్‌ కేసులు నమోదుగా 251 మరణాలు సంభవించాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు