స్టాక్‌ మార్కెట్లపై బేర్‌ పంజా.. ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి

13 Mar, 2023 17:48 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై బేర్‌ పంజా విసురుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల అంశాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 897 పాయింట్లను భారీగా నష్టపోయి 58237 వద్ద, నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 17154 వద‍్ద ముగిసింది.   

నిఫ్టీ జోన్‌లు ప్రస్తుతం 17,250 పాయింట్ల వద్ద ఉండగా.. మార్కెట్‌లలో అనిశ్చితి ఇలాగే కొనసాగితే 17,000-16,800 స్థాయిల వైపు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్‌ ప్రతినిధి చందన్ తపారియా చెప్పారు.

ఇక మార్కెట్లు ముగిసే సమయానికి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ ఎం, ఎథేర్‌ మోటార్స్‌,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. 

అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంకును సైతం మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై ప్రభావం చూపిందని ట్రేడ్‌ నిపుణులు పేర్కొనగా..  సోమవారం ఒక్కరోజే దాదాపు రూ.4 లక్షలకోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు అంచనా.
 

మరిన్ని వార్తలు