మీకు అలాంటి కాల్స్‌ వస్తున్నాయా? యూజర్లకు ట్రాయ్‌ హెచ్చరికలు

16 Nov, 2023 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) హెచ్చరించింది. ‘కొన్ని కంపెనీలు/ఏజెన్సీలు/వ్యక్తులు ట్రాయ్‌ నుండి కాల్‌ చేస్తున్నామని, అలాగే సందేశాలు పంపుతూ ప్రజలను/కస్టమర్లను మోసగిస్తున్నట్టు ట్రాయ్‌ దృష్టికి వచ్చింది.

ట్రాయ్‌ నుండి కాల్‌ చేస్తున్నట్టు తప్పుగా చెప్పుకునే కాలర్లు నంబర్లను డిస్‌కనెక్ట్‌ చేస్తామని బెదిరిస్తారు. ఆధార్‌ నంబర్లను సిమ్‌ కార్డ్స్‌ పొందేందుకు ఉపయోగించారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అట్టి సిమ్‌లను ఉపయోగిస్తున్నారని కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొబైల్‌ నంబర్‌ డిస్‌కనెక్ట్‌ కాకుండా ఉండాలంటే స్కైప్‌ వీడియో కాల్‌ చేయాల్సిందిగా కస్టమర్‌కు వారు సూచిస్తున్నారు.

ట్రాయ్‌ ఏ వ్యక్తిగత టెలికం కస్టమర్ల మొబైల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయడం లేదా డిస్‌కనెక్ట్‌ చేయదు. ట్రాయ్‌ నుండి వచ్చినట్లు చెప్పుకునే అటువంటి కాల్‌ లేదా సందేశాన్ని మోసపూరితంగా పరిగణించాలి. అలాంటి కాల్స్‌ చట్టవిరుద్ధం’ అని ట్రాయ్‌ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు