615 పాయింట్లు రికవరీ,  సరికొత్త గరిష్టం

14 Jun, 2021 16:26 IST|Sakshi

నష్టాల నుంచి భారీగా పుంజుకున్న  సూచీలు

అదానీ, బీహెచ్‌ఈఎల్‌ నష్టాలు,

రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌ లాభాల మద్దతు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచికోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ లాంటి ఇండెక్స్ హెవీవెయిట్స్‌లో లాభాలతో కీలక సూచీలు భారీగా పుంజుకున్నాయి. మిడ్‌ సెషన్‌ తరువాత డేకనిష్టంనుంచి సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 205 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్‌ 78 పాయింట్లుఎగిసి 52551 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభంతో 15811 వద్దస్తిరపడింది. తద్వారా కీలక సూచీలు వరుసగా మూడో సెషన్‌లో సరికొత్త గరిష్టాలను నమోదు చేయడం విశేషం. అలాగే సెన్సెక్స్‌రికార్డు వద్ద క్లోజ్‌ అయింది. ఐటీ,ఎఫ్‌ఎంసీజీ లాభపడగా, ఆటో, బ్యాంకింగ్‌ నష్ట పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.8 శాతం ఎగియా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డి లాభపడ్డాయి. ఇక ఎన్‌ఎస్‌డీఎల్‌ ఖాతాల ఫ్రీజ్‌వార్తలతో అదానీ గ్రూప్  షేర్లలో భరీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది.కొటక్ మహీంద్రా , ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు టాటా మోటార్స్‌,విప్రో, దివీస్‌,  ఓఎన్‌జీసీ, శ్రీ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, బ్రిటానియా, ఇండస్‌ ఇండ్‌ లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు