మూడో రోజు లాభాలు: 50 వేలకు చేరువలో సెన్సెక్స్‌

28 Apr, 2021 16:43 IST|Sakshi

50వేలకు చేరువలో సెన్సెక్స్‌

14800ఎగువన ముగిసిన నిఫ్టీ

సాక్షి, ముంబై :దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన మార్కెట్లు దాదాపు 800 పాయింట్లు ఎగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి.  సెన్సెక్స్‌ 790 పాయింట్లు ఎగిసి 49733వద్ద, నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 14864 వద్ద మగిసింది. బ్యాంకింగ్‌,  ఫైనాన్షియల్  రంగ లాభాలో  బ్యాంకు నిఫ్టీ 987 పాయింట్లు ఎగిసింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంకు , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీగా లాభపడ్డాయి.మరోవైపు బ్రిటానియా, హిందాల్కో,  హిందాల్కో   జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  బీపీసీఎల్‌, నెస్లే నష్టపోయాయి.
 

మరిన్ని వార్తలు