గూగుల్‌ వార్నింగ్‌, ప్రమాదంలో స్లైస్‌ వినియోగదారులు!

24 Jun, 2022 18:22 IST|Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ 'స్లైస్‌' యాప్‌ వినియోగిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. కస్టమర్ల డేటాను స్లైస్‌  దొంగిలిస్తుందంటూ టెక్‌ దిగ్గజం గూగుల్ ఆరోపించింది. అంతేకాదు యాప్‌ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఫోన్‌లలో నుంచి అన్‌ ఇన్‌ స్టాల్‌ చేయాలని సూచించింది.    
 
క్రెడిట్‌ కార్డ్‌లకు ప‍్రత్యామ్నయమని చెప్పుకునే ఫిన్‌టెక్‌ కంపెనీ స్లైస్‌ యాప్‌ వినియోగదారుల పర్సనల్‌ డేటాను స్పై చేయాడానికి ప్రయత్నిస్తుందని గూగుల్‌  హెచ్చరించింది. వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న టూల్‌ను గుర్తించేలా గూగుల్‌ప్లే ప్రొటెక్ట్‌ టూల్‌ పనిచేస్తుందని,ఆ టూల్‌.. స్లైస్‌ వినియోగదారుల డేటాను దొంగిలించే అవకాశం ఉందని గుర్తించినట్లు వెల్లడించింది.  

వ్యక్తిగత డేటా స్పై  
స్లైస్‌ పంపిన నోటిఫికేషన్‌ను  క్లిక్ చేయడం ద్వారా యూజర్ని ప్లే ప్రొటెక్ట్ పేజీకి తీసుకెళుతుంది. ఇది మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు లేదా కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాను స్పైస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక హానికరమైన అప్లికేషన్ ఉన్నట్లు గుర్తించామని గుగుల్‌ చెప్పింది. యాప్‌ను అన్ ఇన్ స్టాల్ చేయాలని యూజర్లకు సిఫారసు చేసింది.

స్లైస్ ఏం చెబుతుంది 
గూగుల్‌ గుర్తించిన సమస్యను పరిష్కరిస్తున్నట్లు స్లైస్ ట్విట్‌ చేసింది. 'నిన్న సాయంత్రం- మా ఆండ్రాయిడ్ అప్ డేట్ ప్లే స్టోర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మేం దానిపై దర్యాప్తు చేసి గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తామంటూ ట్విట్‌లో పేర్కొంది. అంతేకాదు 1శాతం మంది యాప్‌ వినియోగదారులు పాత వెర్షన్‌లో ఉన్నారని, వాళ్లు లేటెస్ట్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేయాలని స్లైస్‌ కోరింది.

మరిన్ని వార్తలు