స్పైస్‌జెట్‌కు లాభాలు

25 Feb, 2023 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ డిసెంబర్‌ త్రైమాసికానికి రూ.107 కోట్లను ప్రకటించింది. ప్రయాణికులు, సరుకు రవాణా పరంగా పనితీరు మెరుగ్గా ఉండడం లాభాలకు కారణమని కంపెనీ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలానికి స్పైస్‌జెట్‌ లాభం రూ.23.28 కోట్లుగా ఉంది.

విదేశీ మారకం సర్దుబాటుకు ముందు చూస్తే డిసెంబర్‌ క్వార్టర్‌లో లాభం రూ.221 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.2,679 కోట్ల నుంచి రూ.2,794 కోట్లకు పెరిగింది. ‘‘మా ప్యాసింజర్, కార్గో వ్యాపారం మంచి పనితీరు చూపించడం లాభాలకు తోడ్పడింది. రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయి. రుణ భారం తగ్గించుకునేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి’’ అని స్పైస్‌జెట్‌ చైర్మన్, ఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు