బ్యూటీ ప్రొడక్ట్స్‌ విక్రయాల్లోకి ‘లువీ’

15 Feb, 2021 04:53 IST|Sakshi

నటి శ్రీముఖి నేతృత్వంలో కంపెనీ

ఏడాదిలో 150 ఔట్‌లెట్ల ఏర్పాటు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యూటీ ప్రొడక్ట్స్‌ విక్రయాల్లోకి కొత్త బ్రాండ్‌ ‘లువీ’ ఎంట్రీ ఇచ్చింది. యాంకర్, నటి శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్‌ ఏర్పాటైంది. లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం. తొలుత పర్‌ఫ్యూమ్స్‌ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్‌ కేర్‌ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేస్తారు. 40 అంతర్జాతీయ బ్రాండ్స్‌తో కలిపి మొత్తం 80 కంపెనీల సుగంధ పరిమళాలు ఇక్కడ కొలువుదీరాయి. వీటి ధరలు రూ.299తో ప్రారంభమై రూ.7,500 వరకు ఉంది.  

‘వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని కొన్నేళ్లుగా భావిస్తున్నాను. నా ఆలోచనలకు తగ్గ భాగస్వాములు దొరికారు. వారికి ఉన్న రిటైల్‌ అనుభవం లువీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పర్‌ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడకం పల్లెల్లోనూ  పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ ద్వారా నిరుద్యోగులకు తోడ్పాటు అందించాలన్నది నా ఆలోచన’ అని లువీని ప్రమోట్‌ చేస్తున్న రస్‌గో ఇంటర్నేషనల్‌ డైరెక్టర్, బ్రాండ్‌ అంబాసిడర్‌ శ్రీముఖి ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. తిరుపతి రావు వొజ్జా, శ్రీకాంత్‌ అవిర్నేని, విజయ్‌ అడుసుమల్లి కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు.

తొలి ఏడాది 150 స్టోర్లు..
షాప్‌ ఇన్‌ షాప్‌ విధానంలో స్టోర్ల ఏర్పాటుకు లినెన్‌ దుస్తుల విక్రయంలో ఉన్న లినెన్‌ హౌజ్‌తో లువీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. లినెన్‌ హౌజ్‌కు చెందిన 23 దుకాణాల్లో షాప్‌ ఇన్‌ షాప్స్‌ ఏర్పాటు చేసింది. ఏడాదిలో 150 స్టోర్లను సొంతంగా ప్రారంభించనున్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు