వచ్చే వారం మార్కెట్లలో ర్యాలీ? నిఫ్టీ 20 వేలు దాటేస్తుందా?

22 Sep, 2023 21:35 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఈ వారాంతంలో  నష్టాల్లో ముగిసాయి.గతవారం చీర్‌పుల్‌గా మార్కెట్లు ఈ వారం షాక్‌ ఇచ్చాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కనిష్టాల వద్ద రికవరీని సాధించాయి. ఈనేపథ్యంలో  తదుపరి వారం పాజిటివ్‌గా ట్రేడ్‌లో ఉండవచ్చు. నియోట్రేడర్‌ కో-ఫౌండర్‌ రాజా వెంకటరామన్‌ సాక్షిబిజినెస్‌ కన్సల్టెంట్‌ కారుణ్య రావు సంభాషణ విందాం. వచ్చే వారం మార్కెట్‌ ధోరణి ఎలా ఉండబోతోంది. బ్యాంకింగ్‌ షేర్లలో ఏవి బెటర్‌. ముఖ్యంగా నిఫ్టీ సపోర్ట్‌ లెవల్స్‌ ఏంటి అనేది ఒక సారి చూద్దాం. 

నిఫ్టీ 50 కచ్చితంగా 20000-20200, కానీ 202600 వద్దకు వెళ్లే ఛాన్స్‌ వుంది. లోయర్స్‌ లెవల్స్‌లో కొనుగోళ్లు జరిగే అవకాశం  ఉంది. బ్యాంక్‌ నిఫ్టీకి ఇప్పటివరకూ పాజిటివ్‌ సంకేతాలే ఉన్నాయి. అయితే నిఫ్టీ19600-19500 వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ లెవల్‌ బ్రేక్‌ అవ్వనంత వరకు పెద్దగా  ఆందోళన  అవసరం లేదు. ఈ లెవల్స్‌లో కొనుగోలు చేస్తే మళ్లీ నిఫ్టీ 20వేలకు చేరే అవకాశం ఉంది. 

బ్యాంకింగ్‌ స్టాక్స్‌ బలహీనంగా ఉన్నాయి. బ్యాంకింగ్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ బ్యాంకులా, ప్రైవేటు బ్యాంకులా అనేది ఎలా చూడాలి. కచ్చితంగా పీఎస్‌యూ బ్యాంకులే పటిష్టంగా ఉన్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీభారీగా నష్టపోయినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశం ఉంది.

రికమెండెడ్‌ స్టాక్స్‌: టీవీఎస్‌ మోటార్స్‌, టీసీఎస్‌ కొనుగోలు చేయవచ్చుని   రాజా వెంకటరామన్‌  సూచిస్తున్నారు.

(Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)


 

మరిన్ని వార్తలు