StockMarketUpdate: భారీ పతనం, 62వేల దిగువకు సెన్సెక్స్‌

15 Dec, 2022 14:59 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 737 పాయింట్లు కుప్ప కూలగా నిఫ్టీ 200 పాయింట్లు క్షీణించింది. తద్వారా సెన్సెక్స్‌ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. దాదాపు అన్నిరంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌  టాప్‌ లూజర్‌గా ఉంది.

బ్రిటానియా, హీరో మోటో, ఎస్‌బీఐలైఫ్‌,  ఎన్టీపీసీ, ఎం అండ్‌ ఎండ్‌ లాభపడుతుండగా,  టెక్‌ మహీంద్ర, టైటన్‌, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34  పైసలు  పతనమై  82.7 4 వద్దకు ఉంది.

మరిన్ని వార్తలు