టాటా మాస్టర్‌ ప్లాన్‌.. ప్రపంచ దేశాల్లో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ!

5 Jun, 2023 13:07 IST|Sakshi

దేశీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. గుజరాత్‌ ప్రభుత్వ అంగీకారంతో ఆ రాష్ట్రంలో రూ.13,000 కోట్లతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారు చేయనుంది. 

ఈ మేరకు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ గుజరాత్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గంటకు 20 గిగావాట్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంట్‌ను విస్తరించనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 13,000 మంది ఉపాధి పొందనున్నారు. 

ఇక, టాటా గ్రూప్‌ లిథియం బ్యాటరీ మ్యానిఫ్యాక్చరింగ్‌ సంబంధించిన ప్రొడక్షన్‌ ఈకో సిస్టంలో తోడ్పాటునందించేందుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది. 

భారత్‌తో పాటు మరిన్ని దేశాల్లో 
టాటా గ్రూప్‌ మరో అనుబంధ ఆటోమొబైల్‌ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవడర్‌ బ్రిటన్‌లో ఎలక్ట్రిక్‌ బ్యాటరీ ప్లాంట్‌ నిర్మించేందుకు సిద్ధమైంది. బ్రిటన్‌తో పాటు ఇంగ్లాండ్‌, స్పెయిన్‌ దేశాలు సైతం ఈవీ బ్యాటరీ తయారీలో టాటా గ్రూప్‌కు తగిన ప్రోత్సాహకాల్ని అందించేందుకు ముందుకు వచ్చాయి.  

లిథియం అయాన్‌ నిల్వలు.. వెలిగిపోనున్న భారత్‌
2021 సంవత్సరంలో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నులు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ‌కశ్మీర్‌లోని రియాసి జిల్లా మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్‌ హైమన గ్రామం వద్ద 59 లక్షల టన్నులు, రాజ‌స్థాన్‌లోని డేగ‌నా ప్రాంతంలో ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించింది.ఉప్పగా ఉండే రిజర్వాయర్లు, భూమి లోపల ఉండే రాళ్లలో దొరికే లిథియంతో ఎలక్ట్రిక్‌ విభాగంలో భారత్‌ వెలిగిపోనుంది. 

జీరో కార్బన్‌ ఉద్గారిణిగా 
ప్రధాని నరేంద్ర మోదీ 2027నాటికి భారత్‌ను నాటికి జీరో కార్బన్ ఉద్గారిణిగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా చైనా, అమెరికాతో పోటీపడ్తూ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. 

చదవండి : ముద్ద‌ ముట్ట‌ని పెంపుడు కుక్క‌లు, ప్రిన్స్‌ ఛార్లెస్‌ అవార్డు కార్యక్రమానికి ‘రతన్‌ టాటా’ డుమ్మా!

మరిన్ని వార్తలు