టాటా.. ఆన్‌ లైన్‌ బాట!

27 Aug, 2020 05:28 IST|Sakshi

అమెజాన్, రిలయ¯Œ ్సతో పోటీకి సై

అన్ని ఉత్పత్తులు, సర్వీసులు డిజిటల్‌ మాధ్యమంలో

ఈ–కామర్స్‌ యాప్‌పై కసరత్తు

ఈ ఏడాది ఆఖర్లో ఆవిష్కరణ

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌ తాజాగా ఈ–కామర్స్‌ విభాగంలో అమెజాన్, రిలయ¯Œ ్సకు గట్టి పోటీనిచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వినియోగ ఉత్పత్తులు, సర్వీసులను డిజిటల్‌ మాధ్యమం ద్వారా కస్టమర్లకు చేరువ చేసే దిశగా ప్రత్యేక ఈ–కామర్స్‌ యాప్‌ను రూపొందించుకుంటోంది. ఇప్పటికే దీని నమూనా సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఆవిష్కరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

ఆల్‌–ఇన్‌ –వన్‌ ..: టాటా గ్రూప్‌ కంపెనీలు ప్రస్తుతం.. కార్లు, ఎయిర్‌కండీషనర్లు, స్మార్ట్‌ వాచీలు, టీ మొదలైన అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అలాగే లగ్జరీ హోటల్స్, ఎయిర్‌లై¯Œ్స, బీమా వ్యాపారం, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్, సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ మొదలైనవి నిర్వహిస్తున్నాయి. టెట్లీ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లు టాటా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

రిటైల్‌ వినియోగదారులతో నేరుగా సంబంధాలు నెరపే ఈ వ్యాపార విభాగాల ఉత్పత్తులు, సర్వీసులన్నింటికీ ఈ ఆల్‌–ఇన్‌–వన్‌యాప్‌ ఉపయోగపడనుంది. టా టా డిజిటల్‌ విభాగం సీఈవో ప్రతీక్‌ పాల్‌ ఈ యాప్‌ రూపకల్పనకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాల్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో 3 దశాబ్దాల అనుభవం ఉంది. రిటైల్‌ విభాగం గ్లోబల్‌ హెడ్‌గా వ్య వహరించిన సమయంలో వాల్‌మార్ట్, టెస్కో, ఆల్డి, టార్గెట్, బెస్ట్‌ బై, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌ గ్రూప్‌ వంటి అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజాలు డిజిటల్‌ బాట పట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
 

మరిన్ని వార్తలు