వ్యాపార దిగ్గజం రతన్‌ టాటాకు భారీ ఊరట!

30 Oct, 2023 19:35 IST|Sakshi

సింగూర్‌ నానో ఫ్లాంట్‌ వ్యవహారంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రముఖ డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌కు ప్రతిఫలం దక్కింది. మధ్యవర్తిత్వ అవార్డు (arbitral award) కింద అసలు, వడ్డీ మొత్తం రూ.766 కోట్లు పొందనుంది. 

వెస్ట్‌బెంగాల్‌ సింగూర్‌లో ‘టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ (టీఎంఎల్‌) ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ ఏర్పాటు కోసం కేటాయించిన కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో నష్టపోయాం. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు ఊరట లభించింది. వెస్ట్‌ బెంగాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూబీఐడీసీ)..టీఎంఎల్‌కు అసలు, వడ్డీ చెల్లించేలా ముగ్గురు సభ్యుల ఆర్బిట్ర‌ల్ ట్రిబ్యూన‌ల్స్‌ బృందం తీర్పు వెల్లడించారు’ అని టాటా మోటార్స్‌ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ట్రిబ్యునల్ నిర్ణయంతో.. టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా సెప్టెంబర్ 1, 2016 నుంచి అసలు, ఏడాదికి 11 శాతం వడ్డీతో రూ.765.78 కోట్ల మొత్తాన్ని అందుకోనున్నారు.  

టాటాకు వెయ్యి ఎకరాల భూమి 
వెస్ట్‌  బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్‌కు నానో కార్లను తయారు చేసుకునేందుకు సుమారు 1,000 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. అయితే, ఆ ప్రాంతంలోని రాజకీయ నాయకులు, రైతుల నుండి తీవ్ర నిరసనతో టాటా మోటార్స్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 

వెస్ట్‌ బెంగాల్‌ నుంచి గుజరాత్‌కు 
అప్పటికే టాటా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీంతో పెట్టుబడులు విషయంలో తమకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని న్యాయ పోరాటం చేస్తుంది.  ఎట్టకేలకు ఈరోజు ట్రిబ్యూనల్‌ టాటా మోటార్స్‌కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక నాటి పరిస్థితుల దృష్ట్యా టాటా మోటార్స్‌ నానో కార్ల తయారీ ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్‌ నుంచి తయారీ యూనిట్‌ను గుజరాత్‌లోని సనంద్‌కు మార్చింది. అక్కడే టాటా నానో తయారైంది. 

మరిన్ని వార్తలు