భగభగమంటున్న బంగారం ధరలు! రష్యా యుద్ధం ఆగలేదంటే అంతే సంగతులు

6 Mar, 2022 12:31 IST|Sakshi

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే యుద్ధం మరో 2-3 నెలలు కొనసాగితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

దీంతో 10 గ్రాముల బంగారం రూ.56వేలు, గ్లోబల్‌ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 2100 డాలర్లకు చేరే అవకాశం ఉండనుంది. కిలో వెండి ధర రూ.80వేల నుంచి రూ.85వేలకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది.  

కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది. 

విశాఖపట్నంలో బంగారం ధరలు అదే ట్రెండ్‌ను అనుసరించి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది.  

హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా బెంగుళూరులో వెండి ధరలు రూ.73,400గా ఉంది. 

చదవండి: అదిరిపోయే గాడ్జెట్‌, ఫోన్‌లో మీరు అరిచి గీపెట్టినా ఎవ్వరికి వినబడదు!

మరిన్ని వార్తలు