BSNL Recharge Plans: దీర్ఘకాలిక వ్యాలిడిటీ, ఓటీటీ సేవలను అందిస్తోన్న టాప్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌ ఇవే..!

21 Dec, 2021 17:23 IST|Sakshi

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) దీర్ఘకాలిక వ్యాలిడిటీ, హై స్పీడ్‌ డేటాతో పలు ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్లాన్లతో పోల్చితే...బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తున్నాయి.  వీటితో పాటుగా యూజర్లు పర్సనలైజ్‌డ్‌ రింగ్‌ బ్యాంక్‌ టోన్‌ సేవలను  ఉచితంగా పొందవచ్చును. 

దీర్ఘ-కాల వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోన్న టాప్‌ 5 ప్లాన్స్‌ ఇవే..!

1. రూ. 2,399 ప్రీపెయిడ్‌ ప్లాన్
రూ. 2,399 ప్లాన్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లు  425 రోజుల వ్యాలిడిటీను పొందుతారు. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 3జీబీ డేటా, 100ఎస్‌ఎమ్‌ఎస్‌, పొందవచ్చును. వీటితో పాటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పీఆర్‌బీటీ రింగ్‌ టోన్స్‌ సేవలను, ఈరోస్‌ నౌ సభ్యత్వాన్ని కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌  అందిస్తోంది.

2. రూ. 1,999 ప్రీపెయిడ్‌ ప్లాన్
ఈ ప్లాన్‌ 365 రోజుల చెల్లుబాటుతో రానుంది. 600జీబీ హై-స్పీడ్ డేటాను పొందవచ్చును. ఒకవేళ 600జీబీ డేటా పూర్తైతే 80కేబీపీఎస్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయవచ్చును.  దీంతో పాటుగా  అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ పీఆర్‌బీటీ రింగ్‌ టోన్స్‌ సేవలను, ఈరోస్‌ నౌ సభ్యత్వాన్ని కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌  అందిస్తోంది.

3. రూ. 1499 ప్రీపెయిడ్‌ ప్లాన్
రూ.1499 ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో రానుంది. ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ యూజర్లు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌, 24జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చును.

4. రూ. 397 ప్రీపెయిడ్‌  ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరలో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ రూ. 397 ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌తో రానుంది. ఈ ప్లాన్స్‌తో 300 రోజుల వ్యాలిడిటీ రానుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌తో పాటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పీఆర్‌బీటీ రింగ్‌టోన్‌ సేవలను కూడా పొందచ్చును.ఈ ప్లాన్‌ ప్రస్తుతం గోవా, మహారాష్ట్ర సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

5. రూ. 999 ప్రీపెయిడ్‌ ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.999 ప్లాన్ 240 రోజుల చెల్లుబాటుతో రానుంది. ఇది రెండు నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్స్‌, పీఆర్‌బీటీ సేవలను పొందవచ్చును. 

చదవండి: 2022లో భారత మార్కెట్లపై స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల దండయాత్ర..! వచ్చే ఏడాదిలో రానున్న పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

మరిన్ని వార్తలు