ఇక పాకిస్తాన్, చైనాకు చుక్కలే.. పంజాబ్‌లో ఎస్‌-400 మోహరింపు!

21 Dec, 2021 17:03 IST|Sakshi

భారత వాయుసేన అమ్ముల పొదిలోకి రష్యాకు చెందిన అత్యాధునిక ఎస్-400 మిస్సైల్స్‌ వచ్చిచేరిన సంగతి తెలిసిందే. భారత్​, రష్యా మధ్య గతంలో జరిగిన ఒప్పందం మేరకు వీటిని రష్యా భారత్​కి పంపించింది. ఇప్పుడు భారత వైమానిక దళం ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను తాజాగా పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ బోర్డర్ వెంట మోహరించింది. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యాదునిక ఏరియల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఇది. డ్రోన్స్‌ నుంచి బాలిస్టిస్‌ మిస్సైల్స్‌ వరకు దేన్నైనా ఎదుర్కొనగల సామర్ధ్యం దీని సొంతం. ఎస్‌-400 ట్రైంఫ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌లో మొదటిదాన్ని భారత్‌ ఇక్కడ మోహరించింది. 

పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎదురయ్యే గగనతల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యంగా మార్చడంలో ఈ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత తూర్పు సరిహద్దులో భారత వాయుసేన ఈ ఎస్‌-400 ట్రైంఫ్‌ మిస్సైల్‌ మోహరించే అవకాశం ఉంది. ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణించే మిస్సైల్‌ వ్యవస్థయే ఎస్- 400 మిస్సైల్‌. దీనిని ఎస్ఏ-21 గ్రోలర్‌ అని నాటో పిలుస్తుంది. ఇది అత్యంత సమర్థవంతంగైన మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అని దీన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌, యూఏవీలు, క్రూయిజ్‌ మిస్సైల్స్‌తోనూ ఉపయోగించవచ్చు. 

ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకతలు:

  • ఎస్-400 రకాన్ని మాస్కోకు చెందిన ఆల్మాజ్‌ సెంట్రల్‌ డిజైన్‌ బ్యూరో రూపొందిచింది. 
  • సైన్యం, వాయుసేన, నౌకాదళానికి చెందిన ప్రస్తుత, భవిష్యత్‌ ఎయిర్‌ డిపెన్స్‌ యూనిట్స్‌తో దీన్ని ఇంటిగ్రేట్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. 
  • ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలో S-300 రకంతో సహ ఇతర శత్రు విమానాలు, బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యాలను ఛేదించేందుకు ఎస్-400 నాలుగు రకాల మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. స్వల్ప-శ్రేణి (40 కి.మీ), మధ్యశ్రేణి (120 కి.మీ), 250 కి.మీ, 400 కి.మీ దూరంలో గల లక్ష్యాలను ఛేదించేందుకు ఇందులో నాలుగు వేర్వేరు మిస్సైల్స్ ఉన్నాయి.

  • ఎస్-400 సంక్లిష్టమైన సైనిక సాంకేతికపరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఎగిరే వస్తువులను ట్రాక్ చేసి, కమాండ్ వాహనాన్ని అప్రమత్తం చేసే దీర్ఘ-శ్రేణి నిఘా రాడార్ ఇందులో ఉంది. 
  • S-400 రకం మిస్సైల్స్‌ పరీక్షలో 2000 ప్రారంభంలో మొదలైంది. 2007 నుంచి ఈ ఆయుధాలు ఉపయోగంలోకి వచ్చాయి. మాస్కో రక్షణ సహ వివిధ ప్రదేశాల్లో S-400లను రష్యా మొహరించింది. 2015లో S-400ను సిరియాలోనూ రష్యా మొహరించింది. అంతే కాదు క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని యూనిట్లను అక్కడ కూడా ఉంచింది.
  • చైనా వైమానిక బెదిరింపులను ఎదుర్కోవటానికి భారతదేశం అవసరమైన ఐదు దీర్ఘ-శ్రేణి ఉపరితల-నుంచి-గాలి క్షిపణి వ్యవస్థలను సేకరించడానికి 2018లో 5.5 బిలియన్ డాలర్లతో రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది.

(చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!) 

మరిన్ని వార్తలు