పెరిగిన ఇన్నోవా హైక్రాస్ ధరలు.. విఎక్స్(ఓ) వేరియంట్ లాంచ్

2 Mar, 2023 11:36 IST|Sakshi

టయోటా కంపెనీ తన ఇన్నోవా హైక్రాస్ VX(O) వేరియంట్‌ని అధికారికంగా విడుదల చేసింది. ఈ వేరియంట్ 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 26.73 లక్షలు, రూ. 26.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

కొత్త ఇన్నోవా హైక్రాస్ విఎక్స్(ఓ) వేరియంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న విఎక్స్, జెడ్ఎక్స్ మధ్య ఉంటుంది. ఇది మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, వైర్‌లెస్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి వాటిని పొందుతుంది.

ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు మొదటిసారిగా తన హైక్రాస్ ధరలను పెంచింది. పెట్రోల్ వేరియంట్‌ ధరలు రూ. 25,000, హైబ్రిడ్ వేరియంట్‌ ధరలు రూ. 75,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత హైక్రాస్ బేస్ వేరియంట్ ధర రూ. 18.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 29.72 లక్షలు (ధరలు, ఎక్స్-షోరూమ్).

టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 172 బిహెచ్‌పి పవర్, 197 ఎన్ఎమ్‌ టార్క్ అందిస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో 183 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది.

రెండు ఇంజిన్లు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి, అదే సమయంలో ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

ఇన్నోవా హైక్రాస్ ADAS టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున ఇందులో పార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. డిజైన్ పరంగా ఉత్తమంగా ఉండటమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

మరిన్ని వార్తలు