ఈసీ నియామకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రధాని, వారు ఉండాల్సిందే..

2 Mar, 2023 11:32 IST|Sakshi

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎలక్షన్‌ కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన  రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్‌ నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామకాలపై కమిటీలో​ ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. అలాగే, ప్రతిపత నేత లేదా విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు ఉండాలని పేర్కొంది. సీబీఐ చీఫ్‌ ఎంపిక తరహాలోనే సీఈసీ నియామకం జరగాలని సూచించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కమిటీ పని చేస్తుందని జస్టిస్ కె.ఎం నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు