శాటిలైట్‌ ఆపరేటర్ల నిబంధనలు సరళతరం కావాలి

24 Nov, 2021 08:38 IST|Sakshi

ట్రాయ్‌ చైర్మన్‌ పీడీ వాఘేలా 

న్యూఢిల్లీ: శాటిలైట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చైర్మన్‌ పీడీ వాఘేలా చెప్పారు. తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి విదేశీ సంస్థలతో నేరుగా లావాదేవీలు జరిపేందుకు అనుమతులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కొనుగోళ్లను స్పేస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారానే చేయాలని, ఇందుకు 5 శాతం చార్జీలు చెల్లించాలని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. ఇలాంటి కొనుగోళ్లకు అవసరమైన అనుమతులన్నీ ఒకే చోట లభించేలా టెలికం శాఖ.. సరళతరమైన సింగిల్‌ విండో విధానం ప్రవేశపెట్టాలని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వాఘేలా సూచించారు.  

మరిన్ని వార్తలు