Truecaller: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్‌..! ఎందుకంటే.?

28 Oct, 2021 18:30 IST|Sakshi

ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గురువారం రోజున ఇండియన్‌ రైల్వేస్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రైల్వే ప్రయాణీకులకు కమ్యూనికేషన్‌ విషయంలో మరింత నమ్మకాన్ని అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ట్రూకాలర్‌ పేర్కొంది. రైల్వే ప్రయాణికుల కోసం 139 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఐఆర్‌సీటీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రూకాలర్‌ యాప్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో 139 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు యూజర్లు కాల్‌ చేసేటప్పడు గ్రీన్‌  వెరిఫైడ్‌ బిజినెస్‌ బ్యాడ్జ్‌ లోగో ఇకపై కన్పించనుంది. 
చదవండి: గూగుల్‌ ప్లే స్టోర్‌లో అలజడి..! భారీగా నిషేధం..!

రైల్వే ప్రయాణికులు పలు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఎస్‌ఎమ్‌ఎస్‌లకు చెక్‌ పెట్టే అవకాశం ఉన్నట్లు ట్రూకాలర్‌ పేర్కొంది. ఐఆర్‌సీటీసీ నుంచి సమాచారాన్ని ట్రూకాలర్‌ యాప్‌ గుర్తించి ధృవీకరించబడిన ఎస్‌ఎమ్‌ఎస్‌ అంటూ ట్రూకాలర్‌ యూజర్లకు నోటిఫికేషన్‌ ఇస్తుంది. అంతేకాకుండా సురక్షితమైన కస్టమర్‌ అనుభవాన్ని ట్రూకాలర్‌ అందిస్తోంది. ట్రూకాలర్‌ యాప్‌లో 139 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఇండియన్‌ రైల్వే లోగో కన్పించనుంది.  

ట్రూకాలర్‌ భాగస్వామ్యంపై ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా మాట్లాడుతూ..రైల్వే ప్రయాణికులకు పటిష్టమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ట్రూకాలర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పలు మోసపూరిత మెసేజ్‌లనుంచి ప్రయాణికులకు ఊరట లభిస్తోందని పేర్కొన్నారు. 
చదవండి:  మీదే ఆలస్యం.. ఐటీ కంపెనీల్లో లక్ష పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్‌

మరిన్ని వార్తలు