టీవీఎస్‌ అపాచీ స్పెషల్‌ ఎడిషన్‌, న్యూ లుక్‌ చూస్తే ఫిదానే!

30 Nov, 2022 11:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 2023 స్పెషల్‌ ఎడిషన్‌ టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త కలర్‌,  కొత్త అప్‌డేట్స్‌తో  స్పెషల్‌గా దీన్ని ఆవిష్కరించింది.  కొత్త పెరల్ వైట్ కలర్‌లో  వస్తున్న స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా  కంపెనీ నిర్ణయించింది.

ఇంజీన్‌, ఫీచర్లు
5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్‌ కూల్డ్, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజన్‌ పొందుపరిచారు.
ఇది 250 ఆర్‌పీఎం వద్ద 17.39 బీహెచ్‌పీ పవర్,  7250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 
అల్లాయ్ వీల్స్‌లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్‌తో కొత్త పెర్ల్ వైట్ కలర్
కొత్త సీటు నమూనాతో డ్యూయల్-టోన్ సీటు
ఎడ్జస్టబుల్‌  క్లచ్ అండ్‌, బ్రేక్ లివర్లు
అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్‌మోడ్స్‌లో లభ్యం. 
TVS SmartXonnect కనెక్టివిటీ
రేర్‌ రేడియల్‌ టైర్‌ 
గేర్ షిఫ్ట్ సూచిక
 సిగ్నేచర్‌  ఆల్-LED హెడ్‌ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్

TVS Apache RTR సిరీస్ బైక్స్‌ అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిసిటీలో ఎల్లప్పుడూ ముందంజలో  ఉన్నాయనీ,  కస్టమర్  అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్‌ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ  పేర్కొన్నారు.  నాలుగు దశాబ్దాల రేసింగ్‌ వారసత్వం, అనుభవంతో  స్పెషల్ ఎడిషన్‌ని  పరిచయం చేయడం  సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు