భారత్‌లో 48వేలకు పైగా ట్విటర్‌ అకౌంట్లు బ్యాన్‌!

2 Jan, 2023 18:06 IST|Sakshi

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ భారత్‌లో 48,624 అకౌంట్లను నిషేధించింది. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడి, ప్రోత్సాహించేలా ఉండడమే అందుకు కారణంగా తెలిపింది. సదరు అకౌంట్లు అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 25 మధ్య కాలంలో ట్విటర్‌ నియమాలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ని​ర్ణయం తీసుకుంది.

కొత్త IT రూల్స్, 2021కి అనుగుణంగా ట్విటర్‌ నెలవారీ నివేదికలో, తన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా ఒకే సమయంలో భారత్‌ నుంచి 755 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపింది.

వాటిలోని 121 యూఆర్‌ఎల్‌ (URL)లపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతో పాటు వ్యక్తిగత వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. భారత్‌ నుంచి అందుకున్న ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి.

దుర్వినియోగం/వేధింపు (681), తర్వాత ఐపీ (IP)-సంబంధిత ఉల్లంఘన (35), ద్వేషపూరిత ప్రవర్తన (20), గోప్యతా ఉల్లంఘన (15)కు సంబంధించినవిగా పేర్కొంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, భారీ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు, 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో, నెలవారీ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది.

చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్‌.. నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే పైసలు కట్టాలి!

మరిన్ని వార్తలు