అమ్మ బాబోయి.. 17 కిమీ దూరానికి ఉబర్‌లో ధరెంతో తెలిసి షాక్ అయిన కస్టమర్?

2 Jan, 2022 21:22 IST|Sakshi

సాదారణంగా మనం ఉబర్ క్యాబ్‌ల ప్రయాణించినప్పుడు ధరలు ఇతర వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మహా అయితే ఈ ధరలు ఒక వంద రూపాయలో లేదా 2 వందలో ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మన చెప్పుకోబోయే స్టోరీ గురుంచి తెలిస్తే షాక్ అవుతారు.. డిసెంబర్ 27న, మాంచెస్టర్ సిటీకి చెందిన సామ్ జార్జ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీకి నైట్ క్లబ్ కు వెళ్లాడు. ఆ రాత్రి అతనికి చాలా ఆలస్యమైంది.  చాలా రాత్రి కావడంతో తను ఇంటికి క్యాబ్‌లో వెళ్లాలని అనుకున్నాడు. అతని ఇల్లు నైట్ క్లబ్ నుంచి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

అయితే, అర్ధరాత్రి కవడంతో క్యాబ్‌లు ఎక్కువగా అందుబాటులో లేవు. దీంతో సామ్ స్నేహితులు అనేక సంస్థలకు చెందిన క్యాబ్‌ల కోసం ప్రయత్నించారు. కానీ, ఏదీ అందుబాటులో లేకపోవడంతో సామ్ ఉబర్ క్యాబ్‌ సేవలను వినియోగించుకోవాలని భావించాడు. ఆ రాత్రి తను, అతను ఫ్రెండ్స్ కలిసి ఉబెర్ ఎక్స్ఎల్ లేదా ఎస్‌యువి కారులో అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి తాగిన మందు కిక్ దిగిన తర్వాత మరుసటి రోజు యాప్ లో క్యాబ్ ఛార్జీలను చూసి ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోయాడు.  క్యాబ్ సంస్థ ఆ యువకుడికి కేవలం 17 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10,000 వసూలు చేసింది. అర్థరాత్రి సమయంలో ఇంటికి చేరుకోవడానికి అరగంట కంటే తక్కువ సమయం పడుతుంది. పార్టీకి అయిన ఖర్చుతో పోలిస్తే క్యాబ్‌కు అయిన ఖర్చు ఎక్కువ. ముందుగానే, ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను యాప్ లో చూపించినట్లు ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ యువకుడు చాలా మత్తులో ఉండటంతో క్యాబ్ ధరంతో తెలియలేదు. 

(చదవండి: 17 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్..!)

మరిన్ని వార్తలు