దేశంలో నిరుద్యోగిత శాతం ఎంతంటే..?

25 Nov, 2023 13:21 IST|Sakshi

పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సమర్థులకు ఉపాధి లభించకపోవడమే నిరుద్యోగమని ప్రపంచ కార్మిక సంస్థ నిర్వచించింది. ప్రపంచం ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటోంది. కొవిడ్‌ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతున్నాయి.

చాలా దేశాల్లో సరిపడా ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందేంత స్థోమతలేక దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. పారిశ్రామికీకరణకు ముందు సంప్రదాయ పనుల వల్ల ఉపాధి సమస్య ఉండేది కాదు. యంత్రాల రాకతో వస్తూత్పత్తి పెరిగినా చాలామందికి పని దొరకడం కష్టం అవుతోంది. పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి దీన్నొక సమస్యగానే గుర్తించలేదు. క్రమంగా నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. 

ఇదీ చదవండి: విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్‌!

నూటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్నది లెక్కతేల్చే ‘నిరుద్యోగిత రేటు’ నిత్యం మారుతోంది. భారత్‌లో ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 7.1 శాతంగా ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే స్విట్జర్‌ల్యాండ్‌లో తక్కువగా 2 శాతం నిరుద్యోగితరేటు ఉంటే గరిష్ఠంగా దక్షిణాఫ్రికాలో 31.9 శాతం ఉంది.

మరిన్ని వార్తలు