వోల్వో-ఐషర్‌ కొత్త ఇంటర్‌ సిటీ బస్సులు 

6 Aug, 2022 10:32 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ కొత్త శ్రేణిని ప్రవేశపెట్టింది. తదుపరితరం ఇంటర్‌సిటీ బస్‌లను శుక్రవారమిక్కడ ప్రదర్శించింది. 

వీటిలో వోల్వో నుంచి 15, 13.5 మీటర్ల కోచ్‌లు, ఐషర్‌ నుంచి 13.5 మీటర్ల కోచ్‌ ఉన్నాయి. బస్‌ మార్కెట్‌ తిరిగి పుంజుకుందని, త్వరలోనే కోవిడ్‌ ముందస్తు స్థాయికి చేరుకుంటుందని వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ ఎండీ, సీఈవో వినోద్‌ అగర్వాల్‌ మీడియాకు తెలిపారు. సుదూర ప్రయాణాల విషయంలో ఈ వాహనాలు పరిశ్రమలో నూతన ప్రమాణాలను సృష్టిస్తాయని అన్నారు.  


 

మరిన్ని వార్తలు